NTV Telugu Site icon

Bhatti Vikramarka : మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టాం

Bhatti

Bhatti

Bhatti Vikramarka : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే పర్వం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష రాయలేక పోయారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా పండగ లాగా నియామక పత్రాలు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క. సంవత్సరం లోపే 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, 5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు నిర్మిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ శాఖ కృషి చేస్తోందని, 2023 – 24న మార్చి 8 పీక్ డిమాండ్ వచ్చింది. దాన్ని తట్టుకుని అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ తీసుకు రావాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, 22,444 మెగావాట్ల పీక్ డిమాండ్ వస్తే కూడా ఇబ్బంది కలుగకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని చూస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.

CM Chandrababu : ఇలా చేస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.. హత్యలు చేస్తే కాదు?

అంతేకాకుండా..’భవిష్యత్ లో 31809 మెగావాట్ల డిమాండ్ కు కూడా కసరత్తు చేస్తున్నాం. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చాము. 20 వేల మెగావాట్ల పవర్ తయారు చేయాలని ఆలోచన చేస్తున్నాం. 2035 నాటికి అదనంగా మరో 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కసరత్తు చేస్తున్నాము. రాష్ట్రంలోని 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 8729 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ నుంచి డిస్కమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు 1485 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 28 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకుని ఆ గ్రామంలో సోలార్.. అబద్దాలు మీదనే బ్రతికిన ఓ రాజకీయ పార్టీ… ఆ పార్టీ నేత మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అప్పుడు చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెబుతూ ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం గడుపుతున్నారు. పదేళ్లు రాష్టాన్ని అప్పుల పాలు చేసి రాష్టాన్ని దివాళా తీశారు. జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్టాన్ని నెట్టేశారు. మేము సాధించిన ప్రగతి చూడాలంటే ఎవరైనా మహిళను బస్సు ఎక్కించి తిప్పండి.. అప్పుడు తెలుస్తోంది. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు పేరుతో అధికారంలోకి రాగానే 7520 కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో వేశాం. 8400 కోట్లతో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వేస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు మొదటి విడత డబ్బులు జనవరి 26న వారి ఖాతాల్లో వేస్తాం. 4840 మంది విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చాము. క్యాబినెట్ లోని ప్రతీ మంత్రి 18 గంటలు పని చేస్తున్నారు. తెచ్చుకున్న రాష్టాన్ని పది సంవత్సరాలు అధోగతి పాలు చేశారు.’ అని భట్టి విక్రమార్క అన్నారు.

Tollywood : పొంగల్‌కు వచ్చిన ప్రతిసారి హిట్టు కొట్టిన బడా నిర్మాత