NTV Telugu Site icon

Bhatti Vikramarka : ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా‌ ప్రభుత్వం.

Bhatti

Bhatti

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా‌ ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామని, లక్ష రుణమాఫి చేస్తానని మోసం చేసింది నాటి బిఅర్ఎస్ ప్రభుత్వమన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీపై బీఅర్ఎస్ మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన మండిపడ్డారు. రెండు లక్షల పైన ఉన్నవారికి కూడ వెసులుబాటు కల్పించే యత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

Women Gain Weight: పెళ్లి తర్వాత మహిళలు ఎందుకు బరువు పెరుగుతారంటే..

అంతేకాకుండా..’ఓడిపోయిన కూడ రోడ్ల మీదకి వచ్చి బిఅర్ఎస్ ఆందోళన చేస్తుంది. పంటకి ఇన్సూరెన్స్ కట్టే యత్నం చేస్తున్నాం. తెలంగాణ రైతంగానికి క్వాలిటి కరెంటు ఇస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టు గా ముఫ్ఫై గ్రామాలు తీసుకుని వ్యవసాయ పంపుసెట్లకి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. పంటలతో పాటుగా పవర్ ఉత్పత్తి ద్వారా రైతుకు ఆదాయం సమకూరే ఏర్పాటు చేస్తాం. మేడారం గ్రామానికి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో విద్యుత్ రంగంలో తెలంగాణని మోడల్ గా తయ్యారు చేస్తాం. పత్తిపాక రిజర్వాయర్ కోసం బడ్జెట్ లో ప్రతిపాదించాము.త్వరలోనే పనులు మొదలు పెడతాం. ‘ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

D. Sridhar Babu: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రచారం చేస్తున్నారు..

Show comments