Bhatti Vikramarka : ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండండి
- అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రెస్క్యూ టీం లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు ఆదేశం
- ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి
- వరద ముంపు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు పాల్గొన్నారు. సోమవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చేసిన సూచనలను పాటించి లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమైన హైడ్రా ప్రస్తుతం తొలగింపులను రెండు మూడు రోజుల పాటు విరామం ప్రకటించి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి హైడ్రా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు.
IND vs AUS: మైండ్ గేమ్స్ మొదలు.. మెక్‌గ్రాత్ కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు: గవాస్కర్
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని అత్యవసర సేవలకు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఉదయం మధిర తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. విద్యుత్తు, మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వరద నీరు ఉదృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి పరిస్థితిని స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మధిర మండలం వంగవీడు గ్రామంలో వాగులో చిక్కుకున్న మత్స్య కార్మికుడు వెంకటేశ్వర్లను రక్షించినట్లు చెప్పారు.
Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య..
రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉన్నదనీ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. వరద ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులను అప్రమత్తం చేసి ముమ్మరంగా సహాయక చర్యలను చేపడుతున్నట్లు వివరించారు. జంట నగరాల్లో వరదల వల్ల ఏర్పడే విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రా ను సన్నద్ధం చేశామని వెల్లడించారు. ఆపరేషన్ రెస్క్యూ టిమ్ లను అందుబాటులో ఉంచామని చెప్పారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!