Gujarat : రెజ్యూమ్ ఫైల్స్ చేతిలో పెట్టుకుని తిరుగుతున్న యువతను ఏం కావాలి అని అడిగితే.. మాకు ఉద్యోగం లేదు, ఒక ఉద్యోగం ఇవ్వండి చాలు అని చెబుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న రిక్రూట్‌మెంట్‌కు కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఇంటర్వ్యూకు వచ్చే ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుజరాత్‌లోని బరూచ్‌లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని భరూచ్‌లోని పారిశ్రామిక ప్రాంతం అంక్లేశ్వర్‌లోని ఓ హోటల్‌లో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ ఇంటర్వ్యూ నిర్వహించింది. హోటల్ సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. 10-12 మంది వస్తారని, ఎంపిక జరుగుతుందని భావించింది.. కానీ ఈ ఉద్యోగం కోసం కంపెనీ వాక్-ఇన్‌ని నిర్వహించగా యువకులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
ఇంటర్వ్యూ కోసం ముందుగా ప్రవేశించే ప్రయత్నంలో యువకుల గుంపులో తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోటల్ మెయిన్ గేట్ ముందు రెయిలింగ్ విరిగిపోవడంతో జనం పెద్ద ఎత్తున అక్కడికి రావడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి భరూచ్ జిల్లా యంత్రాంగం ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు, అయితే సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ విషయాన్ని నిరుద్యోగంతో ముడిపెట్టారు. భరూచ్ జిల్లా సూరత్.. వడోదర మధ్య ఉంది. భరూచ్ పెద్ద గిరిజన ప్రాంతం.
Read Also:Police Firing Nampally: హైదరాబాదులో మరోసారి కాల్పుల కలకలం..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన అంకలేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో జరిగింది. థర్మాక్స్ కంపెనీ అక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. కంపెనీ 10 పోస్టులకు ఇంటర్వ్యూకు ఆహ్వానించింది, అయితే వేలాది మంది యువత ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఆ తర్వాత గొడవ జరిగింది. ఈ తోపులాటలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, లేకుంటే పెద్ద ఘటనే జరిగి ఉండేది.
ఇప్పుడు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంపై కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగం అనే వ్యాధి భారతదేశంలో అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఈ వ్యాధికి ‘కేంద్రంగా’ మారాయని రాహుల్ గాంధీ సోషల్ మీడియా సైట్ X లో రాశారు. కాగా, 22 ఏళ్లుగా గుజరాత్ ప్రజలతో బీజేపీ అనుసరిస్తున్న మోసపూరిత నమూనాకు ఈ వీడియో నిదర్శనమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ఎక్స్-పోస్ట్‌లో రాశారు.
Read Also:Rohit Sharma Prize Money: రాహుల్ ద్రవిడ్ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్!