Bhartha Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో , ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
READ ALSO: Tata Motors 2026 Cars: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ లాంచ్ చేసే కార్లు ఇవే!
ఈ సందర్భంగా సినిమాలోని సాంగ్స్‌కు హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిలు డ్యాన్స్‌తో అదరగొట్టారు. అనంతరం హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాలో తన క్యారెక్టర్ పేరు బాలామణి అని, కొత్త డింపుల్‌ని చూస్తారని చెప్పారు. అలాగే హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. ఇది ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిలిం అని, మోడరన్ రిలేషన్ షిప్ గురించి చాలా హ్యూమరస్, సెన్సిబుల్‌గా సినిమాలో చెబుతున్నట్లు తెలిపారు. ఇందులో తను మానస శెట్టి అనే పాత్రలో కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇది చాలా మోడరన్ కాన్ఫిడెంట్ బోల్డ్ క్యారెక్టర్ అని అన్నారు. తన పాత్ర అందరికీ నచ్చుతుందని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సంక్రాంతి పండగలా ఉంటుందని, తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందని అన్నారు.
READ ALSO: Bhartha Mahashayulaku Vignapthi: పైసా తీసుకొని రవితేజ.. కానీ ఒక కండిషన్!