Site icon NTV Telugu

Bharati Pravin Pawar : హెల్త్ కేర్ పై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించింది

Bharathi Pravin

Bharathi Pravin

ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన చేసి రక్తదాన శిబిరాలు, పిహెచ్సాలు ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. ఆయుష్మాన్ భవ ప్రారంభం అయినందుకు ఆనందంగా ఉందని భారతీ ప్రవీణ్ అన్నారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టామని, హెల్త్ కేర్ పై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించిందన్నారు భారతీ ప్రవీణ్. దీన్ దయాల్ జీ జయంతి రోజున ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఆయుష్మాన్ కార్డులు లబ్ధిదారులకు ఇస్తామని ఆయన అన్నారు. రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందని, పేదలకు అందుబాటులో ఆస్పత్రులు ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడమే మా ఉద్దేశ్యమని, అర్బన్, గ్రామ పరిధిలో కమిటీలు వేసి అందరికి వైద్యం అందిస్తామన్నారు కేంద్రమంత్రి. రక్త దాన శిబిరాలతో ఆపదలో ఉన్న రోగి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, బ్లడ్ బ్యాంక్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్. విజయవాడలో రక్త దానం బాగా చేశారని, 54 క్యాంపులు ఏర్పాటు చేసి రక్త దానం చేసేందుకు అవగాహన కల్పించామని, ఆయుష్మాన్ భవ యాప్ ద్వారా అందరూ చేరొచ్చు అని ఆయన అన్నారు. ఫ్రీ గా మందులు, ఫ్రీ పరీక్షలు, అన్ని సేవలు ఉచితమని ఆయన తెలిపారు.

Also Read : Bandi Sanjay: కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు

ఇదిలా ఉంటే.. ఆదివారం కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ సమక్షంలో విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మూడవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు ప్రధాన దక్షిణాది రాజధానులైన విజయవాడ మరియు చెన్నై మధ్య రైలు, పవిత్ర ఆలయ పట్టణమైన తిరుపతిని (రేణిగుంట మీదుగా)( ప్రజలకు చిరకాల వాంఛ) కలుపుతూ సాగుతుంది. అలాగే, ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య మొదటి వందే భారత్ రైలు.

Exit mobile version