Site icon NTV Telugu

Rajnath Singh: ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే భారత్ లక్ష్యం..

Rajnath

Rajnath

Rajnath Singh: హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మంగళవారం రాత్రి పాకిస్తాన్ పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనికి భారత సైన్యం దీనికి ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. ఈ దాడులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు. భారత్ పై దాడులు జరపడానికి ప్లాన్ చేసిన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యం అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

Read Also: Pakistan Army: పాకిస్తాన్ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మృతి..

ఇక, పూర్తి స్థాయిలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతాయని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా “భారత్ మాతా కీ జై” అని రాసుకొచ్చారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ‘జై హింద్! జై హింద్ కీ సేన’ అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు. కోట్లి, బర్నాలా క్యాంప్, సర్జల్ క్యాంప్, మహ్మూనా క్యాంప్, పీఓకేలోని బిలాల్, పాకిస్థాన్‌లోని మురిద్కే, బహవల్పూర్, గుల్పూర్, సవాయ్ క్యాంప్ లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది.

Exit mobile version