Bhakthi Tv Koti deepotsavam: 10వ రోజు కోటి దీపోత్సవం.. ద్వారకాతిరుమలేశుడి కల్యాణం కమనీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంతో భక్తి టీవీ భక్తుల్ని పరవశింపచేస్తోంది. ముక్కంటిని మరిపిస్తూ.. అద్భుతమయిన కోటి దీపోత్సవం నభూతో నభవిష్యతి అన్న రీతిగా సాగుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 10వ రోజుకి చేరుకుంది. 10వ రోజు కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. ద్వారకా తిరుమలేశుడి కల్యాణం కమనీయంగా జరిగింది.

Also Read
- 2027 World Cup: : పంత్, శాంసన్‌లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కండి.దీపాలను వెలిగించి చీకటిని పారద్రోలడం, మనిషి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా, సుఖశాంతులు కలిగించాలని ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం చాలా విశిష్టమయినది. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది. ఆదివారం కావడంతో వేలాదిమంది భక్తులు కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం గ్రహణం కావడంతో భక్తుల తాకిడి తొలుత తక్కువగా వున్నా.. రాత్రి 8 గంటల టైంకి భక్తులు భారీగా తరలివచ్చారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీపాల ఉత్సవంలో మీరూ పాల్గొనండి.. ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కండి.దీపాలను వెలిగించి చీకటిని పారద్రోలడం, మనిషి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా, సుఖశాంతులు కలిగించాలని ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం చాలా విశిష్టమయినది. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. వేలాదిమంది భక్తులు కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. తొలుత శ్రీ మల్లిఖార్జున విశ్వారాధ్య శివాచార్య స్వామీజీ (కాశీ కొత్త జగద్గురు) , శ్రీ అవధూత గిరి మహారాజ్ స్వామీజీ (బర్దీపూర్, సంగారెడ్డి), శ్రీ బోధమయానంద స్వామీజీ (రామకృష్ణమఠం, హైదరాబాద్) శ్రీ శితికంఠానంద స్వామీజీ (రామకృష్ణమఠం, నిజామాబాద్) వారిచే అనుగ్రహ భాషణం జరిగింది. లింగోద్భవం కనులారా తిలకించారు భక్తులు.

S
బ్రహ్మశ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి వారిచే ప్రవచనామృతం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరుడికి ముడుపుల పూజ వేదికపై నిర్వహించారు. భక్తులచే వేంకటేశ్వర విగ్రహాలకు ముడుపుల పూజ జరిగింది. ద్వారకా తిరులమ శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. గరుడ వాహన సేవలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. 10వ రోజు రామకృష్ణమఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి బోధమయానంద స్వామీజీ ఉపన్యసించారు. సప్తహారతులు సకల శుభాలను కలిగిస్తాయని పండితులు చెబుతారు. కోటి దీపోత్సవంలో సప్తహారతుల దర్శనం సకల సౌభాగ్యదాయకం అంతేకాదు ఆరోగ్యకరం కూడా. భూత.ప్రేత పిశాచ బాధలు హారతులు సందర్శిస్తే తొలగిపోతాయని నమ్మకం.
10వ రోజు ఉత్సవంలో భాగంగా ద్వారకాతిరుమల ఉత్సవమూర్తుల గరుడవాహన సేవ నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జస్టిస్ వెంకట వేణుగోపాల్,డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి కోటి దీపోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు కోటి దీపోత్సవంలో దీపాలు వెలిగించారు. దీప కాంతులతో ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసాన్ని మరిపించింది. గురుదేవులకు గురువందనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. జస్టిస్ వేంకట వేణుగోపాల్ దంపతులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి,రమాదేవి.
కార్తిక గురువారం కోటి దీపోత్సవ ప్రాంగణం రత్నగిరిన తలపించనుంది. అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారు రాబోతున్నారు. గురువారం కుంకుమార్చనతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ దీపాల ఉత్సవంలో మీరూ పాల్గొనండి.

తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్‌లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!