Viral Video : రైలులో మట్టి నింపిన నకిలీ పవర్ బ్యాంక్‌ల విక్రయం..వీడియో వైరల్
- రైలులో వస్తువులు కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
- ప్రయాణికులను మోసం చేయడానికి వెనుకాడని విక్రయదారులు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పవర్ బ్యాంకు విక్రయదారుడి వీడియో
- మట్టితో నిండిన పవర్ బ్యాంకుల విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలులో ప్రజలు అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కొందరు తినుబండారాలు, నీళ్లు, ఇయర్‌ఫోన్‌లతో సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అమ్ముతుంటారు. కానీ ఈ విక్రయదారులు చాలా మంది ప్రయాణికులను మోసం చేయడానికి వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి ప్రయాణికులకు పవర్ బ్యాంక్‌లను విక్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. విక్రయదారుడు దాని ధరలను రూ.500, రూ.550గా పేర్కొన్నాడు. అప్పుడు ఓ ప్రయాణికుడు పవర్ బ్యాంక్ నకిలీదిగా గుర్తించాడు.
READ MORE:NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌తో తేజస్వీ యాదవ్‌కు సంబంధం ఉంది..
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
రైలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒక్క నిమిషం వీడియో వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ‘స్కామ్ 2024’ అని పిలుస్తున్నారు. వీడియోలోని వివరాల ప్రకారం.. సేల్స్‌మ్యాన్ రైలులో వచ్చి పవర్ బ్యాంక్ కావాలా వద్దా అని ఒక ప్రయాణికుడిని అడుగుతాడు. ఇది కంపెనీకి చెందిన పవర్ బ్యాంకేనా అని ప్రయాణికుడు అడుగుతాడు. విక్రయదారుడు అవునని సమాధానమిస్తాడు. ఏడాది గ్యారెంటీ ఉందని చెప్పాడు. రూ.500 నుంచి రూ.550 రేంజ్ లో తన వద్ద చాలా పవర్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పాడు. కొన్ని కంపెనీ పేర్లతో ఉన్న నకిలీ పవర్ బ్యాంకులను ప్రయాణికుడికి చూసిప్తాడు. ప్యాసింజర్ బేరం ఆడటంతో పవర్ బ్యాంక్‌ని రూ.300కి ఇచ్చేందుకు అంగీకరిస్తాడు విక్రయదారుడు. దీని తర్వాత ప్రయాణీకుడు పవర్ బ్యాంక్ వెనక భాగం నుంచి తెరిచి చూస్తాడు.
READ MORE: Darshan Wife: ఆ వార్తలు ప్రసారం చేయొద్దు.. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న దర్శన్ భార్య!
అది పూర్తిగా మట్టితో నిండి ఉంటుంది. ప్రయాణికుడు ఇలా చేస్తాడని దాన్ని అమ్మే వ్యక్తి అనుకోలేదు. దాన్ని ప్రయాణికుడి నుంచి లాక్కునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌కి సంబంధించిన క్యాప్షన్‌లో ‘పవర్ బ్యాంక్‌లో మట్టి కనిపించింది. జాగ్రత్త.’ ఓ వినియోగదారు ద్వారా పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్”లో భాగస్వామ్యం చేసారు. దీనికి ఇప్పటి వరకు 3.29 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా 3.3 వేల మంది లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు కూడా పోస్ట్‌పై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
पावर बैंक में निकली मिट्टी, सावधान रहें सतर्क रहें 🥺 pic.twitter.com/PiOsJkizCZ
— Sankott (@Iamsankot) June 18, 2024
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!