Hyderabad: ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నారు. ఇక్కడ అబ్బాయి సీరియస్‌గానే ప్రేమించాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తితో ప్రేమాయణం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని పిచ్చి ప్రేమికుడు కన్నవాళ్ల గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ రామంతాపూర్ లో అమ్మాయి మోసం చేసింది అని చక్రపాణి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.