Cough : దగ్గు తగ్గడం లేదా.. అదిరిపోయే వంటింటి చిట్కాలు ఇవిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దగ్గు, జలుబు లేకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీలవుతాం. అదే గొంతులో తేడాగా ఉన్నా… ముక్కులో గడబిడ ఉన్నా… క్రమంగా మనం నీరసించిపోతాం. ముఖ్యంగా చలికాలంలో దగ్గు, జలుబు మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే.. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు మనిషిని కుంగదీస్తుంది. ఒక వేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, ఛాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. అయితే.. ఈ వంటింటి చిట్కాలతో కూడా దగ్గు, జలుబులకు చెక్ పెట్టవచ్చు.
వాము: పొడి దగ్గు పగటి కంటే రాత్రి సమయంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేసుకుంది నిద్రించే దానికి ముందు చిటికెడు వామును నలిపి, దవడ ని పెట్టుకొని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తులసి : జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి, వీలైతే నీళ్ళలో వేసి మరిగించి కషాయంగా తీసుకోవచ్చు. తులసి కషాయం కఫాన్ని నివారించి ఉపశమనం కలిగిస్తుంది.
దాల్చిన చెక్క : ఇందులో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లను ఎదుర్కొనే గుణాలు ఆధికం. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి చప్పరించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం : దీంట్లో యాంట వైరల్, ఫంగల్ గుణాలు అధికం. దగ్గు, గొంతునొప్పి వంటి వాటిని అదుపు చేస్తుంది. అల్లం సన్నగా తరిగి నమలడం, లేదంటే అల్లం టీ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
తేనె : వంటింటి ఔషధాలలో తేనె ఒకటి. అల్లం, లేదంటే నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవాలి. అతిగా కాకుండా పరిమితంగా తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తేనే, నిమ్మరసం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
మిరియాలు : చిటికెడు, మిరియాల పొడికి చెంచా తేనె చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఇలా ఉదయం పూట మాత్రమే తీసుకుంటే రోజంతా దాని ప్రభావం ఉంటుంది.
పసుపు : యాంటీ సెప్టిక్ గుణాలున్న పసుపు పలు వ్యాధుల్ని నయం చేస్తుంది. జలుబు, దగ్గు విపరీతంగా బాధ ఇస్తున్నప్పుడు గ్లాస్ గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!