ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ ఎముకలు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో కొత్త కణాలను సృష్టించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కండరాల బలహీనత, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, అలసిపోవడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:YS Jagan: డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ..
ప్రోటీన్ లోపం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రోటీన్ మన కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. దీని లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి. శరీరం సన్నగా తయారవుతుంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల శరీరానికి శక్తి అందదు. దీంతో నీరసం వస్తుంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. దీని కారణంగా, జుట్టు రాలడం జరుగుతుంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల చర్మం కూడా నిస్తేజంగా మారుతుంది. ముడతల సమస్య కూడా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్లను నియంత్రిస్తుంది. ఇది ఆకలి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
Also Read:Aaron Finch: విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు..
ప్రోటీన్ అందించే బెస్ట్ ఫుడ్స్
గుడ్లలో కాల్షియంతో పాటు మంచి మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ఉదయం అల్పాహారంగా గుడ్లు తింటే ప్రోటీన్ లోపాన్ని అధిగమించొచ్చు. ప్రోటీన్ లోపాన్ని తీర్చుకోవాలంటే.. ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. పాలు, జున్ను, పెరుగులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు పాలలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్, కాయధాన్యాలు, శనగలు, కిడ్నీ బీన్స్ తినడం ద్వారా కూడా ప్రోటీన్ లోపాన్ని తీర్చుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఈ గింజలను తింటే, శరీరంలోని ప్రోటీన్ లోపం తీరుతుంది.