బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ ఎముకలు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో కొత్త కణాలను సృష్టించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కండరాల బలహీనత, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, అలసిపోవడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు…