Site icon NTV Telugu

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ నుండి మీ గుండెను రక్షించుకోవాలంటే ఈ నూనెలను వాడాల్సిందే!

Oils

Oils

Bad Cholesterol: ప్రస్తుత కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉండడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు లాంటి సమస్యలకు దారితీస్తుంది. వీటి నుండి మనం బయటపడాలంటే.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డైటీషియన్ల సూచన ప్రకారం, కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి సహజమైన విధానంలో తయారు చేయబడటంతో అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిలో అధికంగా ఉంటాయి. కాబట్టి, గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన 3 వంట నూనెల గురించి చూద్దాం..

Also Read: Union Budget 2025: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

ఆవ నూనె:
ఆవ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఓమేగా-3 ఫ్యాటి యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మంటను తగ్గించడంతో పాటు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో సెసామిన్, సెసామోల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

Also Read: Karthi : తండేల్ రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను

ఆలివ్ నూనె:
ఆలివ్ నూనెను సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. ఇందులో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ (MUFA) పుష్కలంగా ఉండటంతో, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించగలదు. అంతేకాకుండా, ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

ఈ కోల్డ్ ప్రెస్‌డ్ నూనెల వల్ల ఉపాయగల విషయానికి వస్తే.. ఇందులో హానికరమైన రసాయనాలు ఉండవు. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి సహజ రుచులను కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే, రోజువారీ వంటల్లో ఈ ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించండి. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.

Exit mobile version