సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్‌వుడ్ (2/36) గట్టి బౌలింగ్‌ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read:India Pakistan: గడువులోగా పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్లకుంటే.. ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసా..?
బెంగళూరు 18.3 ఓవర్లలో 165/4 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ (51), కృనాల్ పాండ్య (73*) అర్ధ సెంచరీలతో 6 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. దీంతో, సొంతగడ్డపై జరిగిన ఓటమికి RCB ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంది. బెంగళూరు జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
Also Read:Minister Seethakka: ఒక నియంత అధికారం పోయిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నటుంది..
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సిబికి మంచి ఆరంభం లభించలేదు. మూడో ఓవర్లోనే అక్షర్ పటేల్ బెథెల్ వికెట్ తీసుకున్నాడు. బెథెల్ బ్యాట్ నుంచి కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే ఓవర్‌లో, దేవదత్ పాడిక్కల్ కూడా ఖాతా తెరవకుండానే అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రజత్ పాటిదార్ కూడా నాల్గవ ఓవర్లో రనౌట్ అయ్యాడు. అంటే రెండు ఓవర్లలోనే ఆర్‌సిబి మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ దంచికొట్టారు. వీరిద్దరి మధ్య 83 బంతుల్లో 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పాండ్యా 47 బంతుల్లో 73 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. కోహ్లీ 51 పరుగులు చేసి 4 ఫోర్లు కొట్టాడు.
Also Read:Minister Seethakka: ఒక నియంత అధికారం పోయిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నటుంది..
ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించలేదు. పేలవంగా బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ పోరెల్ నాలుగో ఓవర్లోనే ఔటయ్యాడు. కరుణ్ నాయర్ వికెట్ మరుసటి ఓవర్లోనే పడిపోయింది. నాయర్ బ్యాట్ నుంచి కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫాఫ్, కెఎల్ రాహుల్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. కానీ 10వ ఓవర్లో ఫాఫ్ వికెట్‌ను కృనాల్ పాండ్యా తీసుకున్నాడు. ఫాఫ్ 22 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా 15 పరుగులు మాత్రమే చేసి హాజెల్‌వుడ్ బాధితుడు అయ్యాడు. 14వ ఓవర్లోనే అతని వికెట్ పడిపోయింది. రాహుల్ బ్యాట్ నుంచి 39 బంతుల్లో 41 పరుగులు మాత్రమే వచ్చాయి. స్టబ్స్ చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో ఢిల్లీ జట్టు RCBకి 20 ఓవర్లలో 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.