Bengaluru: అద్దెకు ఇల్లు కావాలా..? రూ. 23 లక్షలు డిపాజిట్ చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: ప్రస్తుతం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే.. సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఇంటి యజమానులు ప్రస్తుతం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. 4BHK ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ కోసం యజమాని రూ. 23 లక్షలు డిమాండ్ చేశారు.
Also Read
- Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
- VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
కాలేబ్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ 4BHK ఇంటి నెలవారీ అద్దె రూ. 2.3 లక్షలు. కానీ.. ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 23 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇది 12 నెలల అద్దెకు సమానమని పోస్ట్‌లో పేర్కొన్నారు. అనంతరం ఆ యూజర్.. ప్రపంచంలోని న్యూయార్క్, టొరంటో, సింగపూర్, లండన్, దుబాయ్ వంటి పెద్ద నగరాలతో పోల్చి వివరించారు. ఈ దేశాల్లో అద్దెలో 5 నుంచి 10 శాతం మాత్రమే డిపాజిట్ చేయమని అడుగుతారని.. భారత్‌లోని బెంగళూరు ఇంటి యజమానులు ప్రపంచంలోనే అత్యంత దురాశపరులని పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే.. ఈ పోస్ట్‌లో ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. ఈ ఫొటోల ప్రకారం.. ఇది నోబ్రోకర్ యాప్‌లో యజమాని ఈ వివరాలు ఉంచారు. దీన్ని కాలేబ్ అనే యూజర్ హైలెట్ చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
READ MORE: Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది..
Bengaluru landlords are the greediest in the world
Rs. 23 lakh security deposit (12 months rent) is OUTRAGEOUS
meanwhile, deposits in other cities:
NYC? 1 month
Toronto? 1 month
Singapore? 1 month per year of lease
SF? 2 months'
Dubai? 5%-10% of annual rent
London? 5-6 weeks' pic.twitter.com/WPkl5o40C9— Caleb (@caleb_friesen2) July 21, 2025
తాజావార్తలు
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!