Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cameras on Vegetable Vendors: ప్రస్తుతం అంతా AI కాలం నడుస్తోంది. బెంగళూరులోని ప్రముఖ KR మార్కెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ పూలు, కూరగాయల వ్యాపారాలతో రద్దీగా ఉండే ఈ మార్కెట్లో తాజాగా ఓ వింత దృశ్యం కనిపించింది. పూలు, కూరగాయలు అమ్మే వ్యాపారులు తలపై కెమెరాలు ధరించి తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.
ఆ వీడియోలో కొందరు వ్యాపారులు తలపై ప్రత్యేక కెమెరాలను ధరించి పూలు, కూరగాయలు విక్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరికరాలు వారి కదలికలు, వస్తువులను చేతబట్టే విధానం, కస్టమర్లతో మాట్లాడే తీరు వంటి రోజువారీ కార్యకలాపాలను రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరాలు ధరించినప్పటికీ వ్యాపారులు తమ సాధారణ పనులను చేసుకుంటున్నారు. అయితే ఈ కెమెరాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించే మోషన్ క్యాప్చర్ పరికరాలు అయి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనుషులు రోజువారీ పనులు ఎలా చేస్తారు? వస్తువులను ఎలా పట్టుకుంటారు? కస్టమర్లతో ఎలా వ్యవహరిస్తారు? వంటి అంశాలను రికార్డ్ చేసి, ఆ డేటా ఆధారంగా రోబోలకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read
- Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
- NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
- 200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో రోబోలే కూరగాయలు అమ్ముతాయా? అంటూ ఓ యూజర్ సరదాగా ప్రశ్నించారు. మరో నెటిజన్ ఈ పరికరాలు ధరించగలిగే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి సంబంధించినవని వివరించారు. మనుషుల చిన్న చిన్న కదలికలను కూడా రికార్డ్ చేసి, హ్యూమనాయిడ్ రోబోలు అదే విధంగా పనిచేసేలా శిక్షణ ఇవ్వడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పరిణామంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి డబ్బు కోసం కార్మికుల నుంచి వారి పనులకు సంబంధించిన డేటాను సేకరించి, భవిష్యత్తులో అదే పనులను రోబోలతో చేయిస్తే మానవ ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు అయితే వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించేందుకు చేసే ప్రత్యేక అరుపులను కూడా ఈ కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయేమోనని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్‌కు కోర్టులో మరో షాక్.. వైట్‌హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
-
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!