Utpalendu Chakraborty Death: ప్రముఖ డైరెక్టర్ ఉత్పలేందు చక్రవర్తి మృతి!
- బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం
- సీనియర్ దర్శకుడు చక్రవర్తి కన్నుమూత
- సీఎం మమతా బెనర్జీ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengali Director Utpalendu Chakraborty Passed Away: ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోల్‌కతా రీజెంట్ పార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్.. ఇద్దరు కుమార్తెలు రీతాభరి, చిత్రాంగద ఉన్నారు. చక్రవర్తికి భార్య సతరూప సన్యాల్ చలనచిత్ర నిర్మాత. ఆయన మృతికి బెంగాలీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు.
1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఉత్పలేందు చక్రవర్తి జాతీయ అవార్డును అందుకున్నారు. 1981లో తన తొలి చిత్రానికు ఇందిరా గాంధీ అవార్డు వరించింది. మోయన్‌తాడంటో (1980), చందనీర్ (1989), ఫాన్సి (1988), దేబ్‌శిశు (1987) చిత్రాలతో సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. స్కాటిష్ చర్చి కళాశాల, కలకత్త విశ్వవిద్యాలయాల్లో చక్రవర్తి చదివారు. సత్యజిత్ రే, రవీంద్ర సంగీత్, దేబబ్రత బిస్వాస్ డాక్యుమెంటరీలను కూడా రూపొందించారు.
Also Read
Also Read: Prabhas: ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు
ఉత్పలేందు చక్రవర్తి గత కొద్ది సంవత్సరాలుగా సీవోపీడీతో బాధపడుతున్నారు. గత ఏప్రిల్‌లో బాత్రూంలో పడిపోవడంతో ఫ్రాక్చర్ అయింది. దానికి ఆయన సర్జరీ చేయించుకున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. ఉత్పలేందు చక్రవర్తి మృతికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో తీరని లోటని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!