శనగను మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. శనగకు ఎప్పుడూ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. లాభాలు ఎక్కువే.. అలాగే తెగుళ్లు కూడా ఎక్కువే.. వాటి వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు..శనగ పంటను సంక్రమించే వివిధ రకాల తెగుళ్ళకు సంబంధించి మొదలు కుళ్లు, వేరు కుళ్లు మరియు ఎండు తెగుళ్ళు వంటివి విస్తృతంగా వ్యాప్తిస్తాయి.గాలి ద్వారా సంక్రమించే తెగుళ్ళు వల్ల పంట దిగుబడుల పై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చు..
శనగను ఆశించే తెగుళ్లు మరియు నివారణ చర్యలు..
ఆకుమాడు తెగులు..
ఈ పేరుకు తగ్గట్లే ఆకుల పై, మొక్కల పై ప్రభావాన్ని చూపిస్తాయి.. విత్తనం మరియు నెల ద్వారా వ్యాప్తి చెందును. ఈ తెగులు ముందస్తుగా విత్తిన పొలాల్లో కనిపిస్తుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి సోకె అవకాశము ఉంది. ఈ తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయిన మొక్కలు ఎండిపోతాయి..
నివారణ చర్యలు..
హెక్సాకొనజోల్ 400 మి. లీ లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా క్లోరోథయోనిల్ 400 గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేసుకోవాలి..
తుప్పు తెగులు..
ఈ తెగులు యూరోమైసిస్ సైసేరి అరైటిని అనే శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఈ తెగులు ఆశిస్తుంది. చల్లని, తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి కారణమౌతుంది. ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి..
నివారణ చర్యలు..
హెక్సా కొనజోల్ 400 మి. లీ. లేదా ప్రోపికొనజోల్ 200 మి. లీ. లేదా ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ 160 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటికి కలుపుకొని వారం గ్యాప్ ఇచ్చి పిచికారి చెయ్యాలి..
బూజు తెగులు..
ఈ తెగులు బొట్రైటీస్ సినెరియా అనే శిలీంద్రం వలన సంక్రమిస్తుంది. శనగ పైరు పూత దశలో వున్నప్పుడు ఆ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పూత పిందే దశలలో ఏర్పడుతుంది.. కాయలు, ఆకులు, మొక్కల పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి..
నివారణ చర్యలు..
థయోబెండజోల్ 200గ్రా. చొప్పున ఎకరానికి పిచికారి చేస్తే తెగుళ్లను నివారించవచ్చు..
ఇంకేదైనా సందేహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..