Site icon NTV Telugu

Mamata Banerjee: మోడీకి ఇంకా ఆరు నెలలే మిగిలి ఉంది.. ప్రధానిపై విమర్శలు

Mamatha

Mamatha

కోల్‌కతాలో ముస్లిం మత పెద్దలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూ పుజారులు, ముస్లిం మత పెద్దలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి నెలవారీ జీత భత్యాన్ని రూ.500 పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇమామ్‌ల(ముస్లిం మత గురువులు) నెల జీతం రూ.2,500 కాగా.. మ్యూజిన్‌ల(ఇతరులను నమాజ్ కోసం పిలిచే వ్యక్తులు) జీతం రూ.1000గా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీమ్‌తో సహా పలువురు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు పాల్గొన్నారు.

Read Also: Pawan Kalyan: చిరంజీవి బర్త్‌ డే.. పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్..!

ముస్లిం సమాజాన్ని కలుపుకొని పోయే అభివృద్ధి పనులపై మమతా బెనర్జీ ప్రభుత్వం ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని ఇటీవల కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఇంతలోనే పుజారులు, ముస్లిం మత పెద్దల నెలవారీ జీత భత్యాలను పెంచడం గమనార్హం. అంతేకాకుండా రాష్ట్రంలోని 700 అన్‌ ఎయిడెడ్ మదర్సాలలకు కూడా ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని ఆమె ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర మొత్తం జనాభాలో 27.01% మంది ముస్లిం ఓట్లు బెంగాల్ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

Read Also: Julakanti Ranga Reddy : కేసీఆర్‌ వామపక్షాలను విస్మరించడం సరికాదు

మరోవైపు ప్రధాని మోడీపై మమతా తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీజీకి ఇంకా ఆరు నెలలే మిగిలి ఉందని.. ఆ తర్వాత అధికారంలో ఉండరని ఆరోపించారు. మోడీని ఓడించేందుకు ఏం చేయాలో అది చేస్తున్నాం.. కానీ వాళ్ల టార్గెట్ నేనే.. ఎందుకో తెలుసా.. బెంగాల్‌లో ఓట్లు చీల్చి సర్ది చెప్పాలనుకుంటున్నారని తెలిపింది. దేశంలో ఎక్కడా ఓడిపోతున్న సీట్ల కోసం.. ఆ తప్పు చేయొద్దు’’ అని బెంగాల్ సీఎం అన్నారు. అలాగే ప్రస్తుతం తాను ఇండియా కూటమిలోనే ఉన్నానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Exit mobile version