Health Tips : రోజూ జీలకర్ర వాటర్ తాగితే ప్రయోజనాలు తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీలకర్రను మనం వంటల్లో వాడుతూ ఉంటాం. ఆహారానికి సువాసనతో పాటు రుచిని కూడా తీసుకొస్తుంది. జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్లు జీలకర్ర వేసి బాగా మరిగించి వడకట్టి నీటిని ప్రతిరోజు ఉదయం పూట త్రాగటం వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర మన జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపులో ఏర్పడే అల్సర్లు నివారిస్తుంది. జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. కడుపులో ఉండే పరాన్న జీవులను నివారిస్తుంది. జీలకర్ర రక్తంలోని చక్కెర నిల్వలు క్రమబద్దీకరిస్తుంది. అధిక రక్త పోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగు పరిచి గుండెకు రక్త సరఫరా సాఫీగా అందేలా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలు మరియు పొడిబారే సమస్యలను తగ్గిస్తుంది.
Also Read : Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం
చర్మానికి కావలసిన పోషకాలను అందించి ముఖానికి నిగారింపు ని ఇస్తుంది. మూత్రాశయం సమస్యలను తగ్గిస్తుంది. జీరా వాటర్ తీసుకోవటం వలన కిడ్నీలో ఏర్పడే రాళ్ళు సైతం కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు. శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటికి పంపుతుంది. ప్రేగులలో ఏర్పడిన వ్యర్ధాలను తొలగిస్తుంది. కడుపులో ఏర్పడే వికారం మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలను తగ్గిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొలల వ్యాధి నుండి ఉపశమనానికి కలిగిస్తుంది. శరీరంలో ఏర్పడే అనారోగ్యం తొలగిస్తుంది. జలుబు, దగ్గులు ను తగ్గిస్తుంది. మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యం తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. బరువు తగ్గి ఎందుకు కూడా జీలకర్ర అమోఘంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిప్పులు చెబుతారు.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!