National Walking Day 2023: ఎంత నడిస్తే.. మీ గుండె అంత పదిలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Walking Day 2023: నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకని మించిన ఎక్సర్ సైజ్ మరొకటి లేదు. డాక్టర్ల , ఫిట్‌నెస్ నిపుణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. నడక మొత్తం శరీరాన్ని కదిలిస్తుంది. అన్ని అవయవాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదు. ఏ వయసు వారైనా నడవవచ్చు. నడక బరువును అదుపులో ఉంచుతుంది. నడక వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అందుకే చిన్నపిల్లలు, పెద్దలు, సీనియర్ సిటిజన్‌లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడవాలి.
నేషనల్ వాకింగ్ డే ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నడక గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజును 2007లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రారంభించింది. శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం లక్ష్యం. కేవలం 20 నిమిషాల నడకతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Also Read
Read Also: Covid 19: దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..
నడక గుండెకు చాలా మేలు చేస్తుంది. నిత్యం నడిచే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. నడక వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నడక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. నడక ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం బాగా జరుగుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. నడక ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. ప్రతిరోజూ నడవడం ద్వారా బరువు తగ్గుతారు.
Read Also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?
నడక ద్వారా శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తయారవుతాయి. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. నడక మనస్సును పదును చేస్తుంది. నడిచేటప్పుడు మెదడులో మార్పులు ఉంటాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తుంది. నడక మెదడు, నాడీ వ్యవస్థలో ఉండే హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలి. హెవీ వర్కవుట్ లేదా జిమ్ రొటీన్‌ని అనుసరించలేని వారు నెమ్మదిగా నడవాలని చెబుతారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు