ENG vs AUS: బెన్ డకెట్ ఊచకోత.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం
- ఆస్ట్రేలియాపై బెన్ డకెట్ సెంచరీ
- 95 బంతుల్లోనే సెంచరీని పూర్తి
- 50 ఓవర్లలో 351 పరుగుల చేసిన ఇంగ్లాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాపియన్ లాహోర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది. ఫిల్ సాల్ట్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జామీ స్మిత్ 15 పరుగులకే వెనుదిరిగాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు తమ తొలి విజయం పట్ల గర్వంగా ఫీలయ్యారు. కానీ బెన్ డకెట్, జో రూట్‌తో కలిసి కంగారూల ఆనందానికి ముగింపు పలికారు.
బెన్ డకెట్, జో రూట్ కేవలం 25.4 ఓవర్లలో 158 పరుగులు జోడించి ఇంగ్లీష్ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. రూట్ 68 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. కానీ బెన్ డకెట్ మాత్రం ఊచకోత కోశాడు. రూట్ ఔటైన వెంటనే తర్వాతి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టాడు. దీంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. 48.4 ఓవర్ల వరకు క్రీజ్‌లో ఉన్న బెన్ డకెట్165 పరుగులు పూర్తి చేసి లబుషేన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్ క్రీజ్‌లోకి వచ్చాడు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
30 ఏళ్ల బెన్ డకెట్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ న్యూజిలాండ్‌కు చెందిన విల్ యంగ్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లాథమ్, భారత్‌కు చెందిన శుభ్‌మాన్ గిల్, దక్షిణాఫ్రికాకు చెందిన ర్యాన్ రికెల్టన్, బంగ్లాదేశ్‌కు చెందిన తౌహీద్ హ్రిడోయ్ కూడా సెంచరీలు సాధించారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!