Bellampalli Congress Leader Gaddam Vinod responded on Porn Videos: వాట్సాప్ గ్రూపులో తాను అశ్లీల మెసేజ్ (పోర్న్ వీడియోలు)లు పోస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ స్పష్టం చేశారు. తన డ్రైవర్ తప్పిదం వల్ల మెసేజ్‌లు వచ్చాయని, ఈ ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చేయని తప్పును తనపై రుద్ది రాజకీయంగా దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని గడ్డం వినోద్ పేర్కొన్నారు.
బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ సెల్ ఫోన్ నంబర్ నుంచి సోషల్ మీడియాలో పోర్న్ వీడియోలు పోస్ట్ అయ్యాయి. రాత్రిపూట కొన్ని వాట్సాప్ గ్రూప్‌లకు పోర్న్ వీడియోలు వెళ్లాయి. అవి చుసిన గ్రూప్ మెంబర్స్.. ఒక్కసారిగా షాక్ తిన్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత గడ్డం వినోద్.. ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే అప్పటికే విషయం బయటికి రావడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో సోషల్ మీడియాలో పోర్న్ వీడియోల పోస్టులపై గడ్డం వినోద్ స్పందించారు.
‘వాట్సాప్ గ్రూపులో నేను అశ్లీల మెసేజ్‌లు పోస్ట్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా ఫోన్ నెంబర్ 9000081819 ఇదే. నేను ఏదైనా అత్యవసర మీటింగ్‌లో ఉన్నా లేదా నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన సమయంలో.. నా కొరకు ఫోన్ చేసే ప్రజలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సమాచారం తెలవడం కోసం మరొక ఫోన్ నా వాహనంలో ఉంటుంది. ఆ మొబైల్‌ను నా వెహికిల్ డ్రైవర్స్ నా సమాచారాన్ని ఇతరులకు చెప్పడం కొరకు వాడుతుంటారు. నిన్న రాత్రి నా డ్రైవర్ మొబైల్ వాడుతున్న సమయంలో అతడి తప్పిదం వల్ల వచ్చిన మెసేజ్‌లే అవి. వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చేయని తప్పును నాపై రుద్ది.. రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని నా ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి, అసభ్యకర పనులకు నేను పాల్పడింది లేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు’ అని గడ్డం వినోద్ అన్నారు.