Bellamkonda Sai Sreenivas: సాయి శ్రీనివాస్ మనసు దోచిన కావ్య ఎవరు? బెల్లంకొండ వారి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఇప్పటికే ఒక ఇంటివారవ్వగా, ఇప్పుడు ఆ జాబితాలోకి మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు. ఆయన వివాహ వేడుకలకు సంబంధించిన తొలి అడుగు పడింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆదివారం ఉదయం ఆయన నిశ్చితార్థానికి ముందు జరిగే ‘రోకా’ (Roka) వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఎవరీ కావ్య..
సాయి శ్రీనివాస్ మనసు దోచుకున్న అమ్మాయి పేరు కావ్య. ఈమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె. కావ్యకు సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన ఈ రోకా వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సాయి శ్రీనివాస్‌కు కెరీర్ బిగినింగ్‌లో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్, ‘జయ జానకి నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘కిష్కింధపురి’తో ఆకట్టుకున్న ఆయన, ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
READ ALSO: Actor Sivaji: ‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి: శివాజీ
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..