Bellamkonda Sai Sreenivas: ఈ వారమే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం.. పెళ్లికొడుకు కాబోతున్న అల్లుడు శీను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ అండ్ యాక్షన్ హీరో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ యంగ్ హీరో పెళ్లి గురించి ఫిల్మ్ నగర్లో రకరకాల చర్చలు నడుస్తుండగా.. తాజాగా ఆయన నిశ్చితార్థం ఈ వారంలోనే జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్గా ‘కిష్కింధపురి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ప్రాజెక్టులతో కెరీర్ గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలోనే, వ్యక్తిగత జీవితంలోనూ ఈ శుభవార్త రావడం విశేషం.
READ ALSO: Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
Also Read
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
సాయి శ్రీనివాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె సినీ రంగానికి చెందినవారా లేక కుటుంబ సభ్యులు నిశ్చయించిన సంబంధమా? అనే విషయాలను ప్రస్తుతానికి అత్యంత రహస్యంగా ఉంచారు. తండ్రి బెల్లంకొండ సురేష్ గతంలోనే తన కొడుకు పెళ్లి గురించి హింట్ ఇచ్చారు. కాబట్టి ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చని సినీ వర్గాల సమాచారం. నిశ్చితార్థం ముగిసిన వెంటనే పెళ్లి తేదీ, వేదిక, వధువు వివరాలపై బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారి ప్రకటన చేయలేదు. కానీ ఈ వారమే ఈ యంగ్ హీరో నిశ్చితార్థం ఉండవచ్చని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Namakkal Egg Exports: కుప్పకూలిన గుడ్డు ధరలు.. రోజుకు రూ.5 కోట్ల నష్టం!
తాజావార్తలు
-
MLA Jagan: ‘బెంగళూరును ఏలుతున్నాం’ వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!