Bellam Bondalu : పిల్లలు ఇష్టంగా తినే తియ్యని బొండాలను ఎలా చేస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది చెక్కరకు బదులుగా బెల్లం వేసుకుంటారు.. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పూర్వకాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అరగంటలోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు… ఎంతో రుచిగా ఉండే,కరకరలాడే బొండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
బెల్లం – 200 గ్రా.,
నీళ్లు – పావు లీటర్,
గోధుమపిండి – అర కిలో,
వంటసోడా – పావు టీ స్పూన్,
ఉప్పు – చిటికెడు,
బొంబాయి రవ్వ – ఒకటిన్నర టీ స్పూన్,
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా..
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు వేసి వేడి చెయ్యాలి.. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.. తరువాత గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా, రవ్వ వేసి కలపాలి. తరువాత వడకట్టిన బెల్లం నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ బోండా పిండిలాగా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి కలపాలి. ఇలా నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాలను వేసుకోవాలి. వీటిని అటు ఇటూ కదుపుతూ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం బోండాలు తయారవుతాయి.. అంతే చాలా సింపుల్ గా స్వీట్ గా ఉండే తియ్యని బొండాలు రెడీ అయినట్లే.. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి.. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు..ఆరోగ్యానికి మంచిది కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!