Beer Bottle Christmas Tree: కేరళలోని గురువాయర్ లో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో.. పండుగ ఆనందం కంటే రాజకీయ రచ్చ ఎక్కువైంది. ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ విషయాన్ని లేవనెత్తగా.. వెంటనే యూడీఎఫ్ సభ్యులు జాయ్ చెరియన్, ఆంటో థామస్ కూడా స్పందించారు. ఖాళీ మద్యం సీసాలతో క్రిస్మస్ వేడుకలు జరపడం సరైన సందేశం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత్‌లో Poco కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. Poco M8, M8 Proపై భారీ అంచనాలు..!
కౌన్సిల్ హాలులో ఈ విషయమై పెద్ద రణరంగమే నడిచందంటే నమ్మండి. ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి నిరసన తెలిపారు. అయితే మున్సిపల్ కార్యదర్శి స్పందిస్తూ.. ఈ క్రిస్మస్ ట్రీ ఉద్దేశ్యం మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం కాదని, రిసైక్లింగ్, సస్టైనబిలిటీపై అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇది ప్రజల్లో చర్చను రేకెత్తించే “కాన్వర్సేషన్ స్టార్టర్”గా రూపొందించామని తెలిపారు.
108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్‌లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?
ఈ క్రిస్మస్ ట్రీ సంప్రదాయ కోన్ ఆకారంలో, ఆకుపచ్చ గ్లాస్ బీర్ బాటిళ్లను పైభాగాన్ని లోపలికి పెట్టి అమర్చారు. పైభాగంలో ఎరుపు నక్షత్రం, మధ్య మధ్యలో క్రిస్మస్ బబుల్స్, గంటలు, వృత్తాకార అలంకరణలు ఉన్నాయి. ఎరుపు కార్పెట్‌పై, ఈస్ట్ నడ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ట్రీని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే యూడీఎఫ్ నేతలు ఈ ట్రీ పట్టణంలో తప్పుడుసందేశం ఇస్తోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు కేపీ ఆర్షిద్ ఈ చర్యను సమర్థించలేమని, దీనికి బాధ్యులైన అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ ట్రీని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
