కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని..