Site icon NTV Telugu

Bhatti Vikramarka: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి.. విద్యుత్ సిబ్బందికి డిప్యూటీ సీఎం ఆదేశాలు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే స్పందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Read Also: Telangana Exit Polls: తెలంగాణలో బీజేపీ సంచలనం.. 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా..

రాష్ట్ర ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు అందుబాటులో ఉండి, సరఫరాలోనూ ఎటువంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. లైన్స్ క్లియరెన్స్ (LC) విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో లైన్‌ క్లియరెన్స్‌ ఇవ్వడానికి వీలు లేదని, ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో ఎల్‌సీ ఇవ్వాలని సూచించారు. ఎల్‌సీ తీసుకుంటున్న సమయంలోను స్థానికంగా ఉన్న వినియోగదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి మొదలు లైన్ మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి, నిరంతరం సమీక్షలు చేసుకుంటూ సమాచారం చేరవేసుకోవాలన్నారు.

Exit mobile version