NTV Telugu Site icon

Champions Trophy 2025: పాకిస్థాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడంటే?

Champions Trophy 2025

Champions Trophy 2025

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్‌ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లి ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు సిద్ధంగా లేదు. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించలేదని తెలుస్తోంది. తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే.. ఏకంగా టోర్నీని వీడాలని పాకిస్తాన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు భారత్‌లో జరిగే ఏ ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాక్ భావిస్తోందట.

Also Read: Satyadev-RRR: ఏంటి.. ‘ఆర్ఆర్ఆర్’లో సత్యదేవ్ నటించాడా! జక్కన్న ఎంతపని చేసే

ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం, పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుందని ఓ పీసీబీ అధికారి తెలిపారు. 2012 నుండి దాయాది దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో.. టీమిండియా మ్యాచులు శ్రీలంకలో జరిగాయి.

Show comments