BCCI: మిగిలిన IPL 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అప్పుడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI-IPL 2026: ఎన్నో రోజులుగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే వెలువడ్డాయి. బీసీసీఐ మార్చి 11న టోర్నమెంట్ మొదటి దశకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ మాత్రమే విడుదల అయ్యి మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి గల కారణాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తాజాగా వెల్లడించారు.
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. 2025 ఐపీఎల్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ తో టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. విదుదలైన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12 వరకు మ్యాచ్ లు జరుగుతాయి. అప్పటివరకు ప్రతి జట్టు సుమారు మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
Also Read
Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలలో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఏడాది తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండటంతో భద్రతా ఏర్పాట్లు, సమన్వయం దృష్ట్యా బీసీసీఐ ముందుగా పూర్తి షెడ్యూల్ ప్రకటించలేదు.
ఈ విషయంపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. టోర్నమెంట్ మాత్రం ముందే నిర్ణయించిన సమయానికి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభ షెడ్యూల్ లో మరో ముఖ్య అంశం ఏమిటంటే.. సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరులోని చినాస్వామి స్టేడియంలో జరగనుండటం. ఇంకా రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్ మ్యాచ్ లలో మూడు ఈసారి గౌహతిలో జరగనున్నాయి. సాధారణంగా జైపూర్ లో జరిగే ఈ మ్యాచ్ లు గత కొన్ని సీజన్లుగా గౌహతిలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి జైపూర్‌లో జరిగే మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది.
🚨 News 🚨
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
— IndianPremierLeague (@IPL) March 11, 2026
ప్రస్తుతం విడుదలైన మొదటి దశ షెడ్యూల్‌తో అభిమానుల్లో ఐపీఎల్ ఉత్సాహం మరింత పెరిగింది. మిగతా మ్యాచ్‌ల తేదీలు ఎప్పుడు వస్తాయో అన్న ఆసక్తి కూడా కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన వెంటనే పూర్తి కార్యక్రమాన్ని బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?