Site icon NTV Telugu

Team India: టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా

Jay Sahh

Jay Sahh

టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ జై షా అభిప్రాయపడ్డారు.

AP High Court: లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

పీటీఐతో జై షా మాట్లాడుతూ.. “మాకు అనుభవం ఉన్న జట్టు ఉంది. ఇంతకంటే మెరుగైన జట్టును ఎంపిక చేయలేము. అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ప్రయత్నించాము. మా జట్టులో 8 మరియు 9 నంబర్లలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లను ఎంపిక చేసాము. ప్రతి పరిస్థితిలోనూ ఆడగలరు.” అని జై షా పేర్కొన్నాడు. అయితే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ఆడనుంది.

India-Canada: భారత్‌పై కెనడా గూఢచార సంస్థ సంచలన ఆరోపణలు..

ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు.. వెస్టిండీస్, అమెరికాకు రెండు జట్లుగా బయలుదేరనుందని జై షా తెలిపారు. “జట్టు రెండు గ్రూపులుగా ప్రపంచ కప్‌కు బయలుదేరుతుంది, ప్లేఆఫ్‌లకు ముందు ఖాళీగా ఉండే ఆటగాళ్లు మే 24న వెళ్తారు. మిగిలిన ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ తర్వాత వెస్టిండీస్‌కు వెళ్తారు.” అని జై షా చెప్పారు. మరోవైపు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను 2027లో ఇంగ్లండ్‌కు బదులుగా వేరే చోట నిర్వహించడంపై ఐసీసీతో మాట్లాడతానని జై షా తెలిపారు.

Exit mobile version