ఆసియా కప్ నిర్వహణపై పాకిస్తాన్ అమీతుమీకి సిద్దమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ పాక్ లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్ ఆడేందుకు తాము పాకిస్తాన్ కు రాబోమని.. తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే దీనికి ససేమీరా అంటున్న పాక్ కూడా ఆసియా కప్ ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడటానికి ఇండియాకు వెళ్లబోమని హెచ్చరిస్తూనే ఉంది.
Also Read : Kangana Ranaut: హద్దు మీరితే, కాల్చి చంపేస్తా.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్
ఇదిలా ఉండగా ఆసియా కప్ నిర్వహణపై ఇవాళ దుబాయ్ లో కీలక సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్ లో పాకిస్తాన్ లో ఆసియా కప్ ఉంటుందా..? లేదా..? అనే దానిపై ఒక క్లారిటీ రానుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ కు బీసీసీఐ కార్యదర్శి అయిన జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడి హోదాలో హాజరుకానున్నాడు. పీసీబీ చీఫ్ నజమ్ సేథీ సారథ్యంలోని బృందంతో పాటు ఏసీసీలో సభ్యదేశాల ప్రతినిధులు కూడా ఈ మీటింగ్ కు హాజరవుతారు. వాస్తవానికి ఇవాళ జరగబోయేది ఏసీసీ సభ్యుల ఎగ్జిక్యూటివ్ బోర్డుల సమావేశమైనా ప్రధానంగా చర్చ అంతా ఆసియా కప్ నిర్వహణ మీదే జరుగనుందని తెలుస్తోంది.
Also Read : RC 15: మెగా పవర్ స్టార్ గుర్రం ఎక్కితే బాక్సాఫీస్ బద్దలవుతుంది…
గత నెలలో పీసీబీ చీఫ్ నజమ్ సేథీ ఇదే ఇష్యూపై బహ్రెయిన్ లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. బహ్రెయిన్ లో కూడా బీసీసీఐ ప్రతినిధి బృందం తమ వైఖరినీ కరాఖండీగా చెప్పేసింది. అయితే నేడు జరుగబోయే సమావేశంలో సభ్యుల మద్దతు కూడగట్టాలని పీసీబీ భావిస్తున్నది. ఏసీసీ సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీసీఐ మీద ఒత్తిడి పెంచాలని పీసీబీ అనుకుంటున్నది.. ఇదే టైంలో బీసీసీఐ తన ధన బలంతో మిగిలిన సభ్యదేశాలను తమవైపునకు తిప్పుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకు కూడా సిద్ధంగా ఉండాలని పీసీబీ వర్గాలు తెలిపాయి.
Also Read : MLA Sudhakar Babu: ఇది చట్ట సభలకు చీకటి రోజు.. నా రక్తం కళ్ల చూశారు..
ఈ నెల చివరివారంలో దుబాయ్ లోనే ఐసీసీ బోర్డు సమావేశం కూడా జరుగునుంది. ఈ మీటింగ్ లో కూడీ పీసీబీ తన వాదనను వినిపించి భారత్ పై ఒత్తిడి పెంచే విధంగా చేయాని వ్యూహాలు రచిస్తుంది. ఆసియా కప్ నిర్వహణలో ఏసీసీ సభ్యదేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారిందని ఈ సమావేశాలపై పీసీబీ చీఫ్ నజమ్ సేథీ అన్నారు. ఏసీసీ మెంబర్స్ అందరికీ దీని గురించి తెలిపినట్లు నజమ్ పేర్కొన్నారు. బీసీసీఐ తన ధనబలంతో ఏసీసీ సభ్య దేశాలతో పాటు ప్రపంచ క్రికెట్ (ఐసీసీ)లో కూడా తమకు అనుకూలంగా మాట్లాడించుకోవచ్చు అంటూ అన్నారు. తానైతే ఆసియా కప్ సీనియర్ మెంబర్స్ అందరికీ దీని గురించి మాట్లాడాను అంటూ నజమ్ సేథీ అన్నారు. తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు ససేమిరా ఒప్పకోమంటుంది.. పాకిస్తాన్.. కానీ దాయాది దేశానికి వచ్చేదే లేదంటున్న బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
