Team India Squad for the T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతున్నప్పటికీ.. అందరూ టీ20 ప్రపంచ కప్ 2024 గురించే చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు భారత జట్టులోకి ఎవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్ల ప్రకటనకు మే 1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అదే రోజు బీసీసీఐ భారత జట్టును ప్రకటింస్తుందని తెలుస్తోంది. దాంతో మే 1 కోసం ఫాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు కలిశారు. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మందితో కూడిన జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చారట. మే 1న బీసీసీఐ అధికారికంగా భారత జట్టును ప్రకటించనుంది. జట్టులో ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మెగా టోర్నీకి ఎవరు ఎంపికవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
టీ20 ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్ స్థానానికి పోటీ ఎక్కువ ఉంది. రిషబ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ కీపర్ స్థానం కోసం పోటీలో ఉన్నారు. ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంచుకుని.. రెండో కీపర్ స్థానంలో రాహుల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో సంజూ బాగానే ఆడుతున్నా.. మెగా టోర్నీలలో ఆడిన అనుభవం అతడికి లేదు. మరోవైపు గత టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకున్న డీకే.. నిరాశపరిచిన విషయం తెలిసిందే.
Also Read: Gold Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు భారత జట్టులో కచ్చితంగా చోటు దక్కించుకోనున్నారు. ఐపీఎల్ 2024లో రాణించని శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరో రెండు రోజులు ఆగితే టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో తేలిపోనుంది.