ఐపీఎల్ ప్రారంభానికి ముందు బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఈ సీజన్‌లో బౌలర్లు బంతిపై ఉమ్మి (లాలాజలం) వాడకంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వాడొచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ముంబైలో గురువారం నిర్వహించిన కెప్టెన్ల సమావేశంలో మెజారిటీ కెప్టెన్ల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Citroen C3: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా..? ఈ కారుపై లక్ష డిస్కౌంట్
కరోనా మహమ్మారి సమయంలో ముందు జాగ్రత్త చర్యగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బంతిపై లాలాజలం వాడడాన్ని నిషేధించింది. 2022లో ఈ నిషేధాన్ని శాశ్వతంగా మార్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని భావించి.. బీసీసీఐ ఐపీఎల్‌లో బౌలర్లు ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. బంతిపై ఉమ్మి పూయడం ద్వారా బౌలర్లకు మరింత సహాయం లభించనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “ఇది రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రమే కాదు, వైట్ బాల్ ఫార్మాట్‌లోనూ బౌలర్లకు కొంత మేర ఉపశమనం కలిగించనుంది” అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత లాలాజల వాడకాన్ని తిరిగి అనుమతించిన మొదటి ప్రధాన క్రికెట్ టోర్నమెంట్‌గా ఐపీఎల్ 2025 నిలవనుంది. ఈ నిర్ణయం లీగ్‌కు ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
Read Also: Hyderabad : మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తుండగా ప్రమాదం.. యువ ఇంజనీర్ దుర్మరణం