WPL 2023: వేలంలో మొత్తం 409మంది.. రూ.50లక్షల కేటగిరీలో మంధాన, హర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమెన్స్ ఐపీఎల్‌కు సంబంధించిన వేలం ప్రక్రియపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 13న జరగబోయే ఈ మెగా వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని తెలిపింది. ఈ వేలానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 1,525 మంది క్రికెటర్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకోగా.. 409 మంది ప్లేయర్లు తుది లిస్టులో చోటు సంపాదించారు. ఇందులో 246 మంది భారత ప్లేయర్లు, 163మంది విదేశీ ప్లేయర్లతో పాటు 8మంది అసోసియేట్ దేశాల వారు ఉన్నారు. అలాగే 202 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు ఇందులో చోటు దక్కించుకోగా.. 199 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వేలంలో భాగం కానున్నారు. ఈ వేలం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 13న మధ్యాహ్నం 2.30గం.కు ప్రారంభమవుతుంది. ఇక ఈ లీగ్ మొదటి సీజన్ మార్చి 4-26 వరకు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో జరగనుంది.
Also Read: Boeing layoff: బోయింగ్‌లోనూ ఉద్యోగాల కోత.. 2000 మందికి ఉద్వాసన!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిపి 90 మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఈ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైస్ అనేద ప్రథమ కేటగిరీ. ఈ కేటగిరీలో మొత్తం 24 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన, దీప్తి శర్మ, ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపిన సారథి షెఫాలీ వర్మ ఈ కేటగిరీలోనే ఉన్నారు. అలాగే ఎలిస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, సోఫీ డివైన్, డియాండ్రా డాటిన్ వంటి స్టార్ విదేశీ ప్లేయర్లూ ఈ కేటగిరీలో చోటు సంపాదించారు. ఇక రెండోదైన రూ.40 లక్షల బేస్‌ప్రైస్‌లో 30 మంది ప్లేయర్లకు అవకాశం లభించింది.
🚨 NEWS 🚨: Women’s Premier League 2023 Player Auction list announced. #WPLAuction
All The Details 🔽 https://t.co/dHfgKymMPN
— Women's Premier League (WPL) (@wplt20) February 7, 2023
- Tags
- WPL 2023
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!