Site icon NTV Telugu

BCCI : ఆస్ట్రేలియాతో వన్డేలకు టీం ఇండియా జట్టు ప్రకటన

Cricket

Cricket

BCCI : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు బీసీసీఐ ఇండియా జట్టును ప్రకటించింది. ఢిల్లీ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత బీసీసీఐ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆడుతున్న జట్టు సభ్యుల్లో పెద్దగా మార్పేమీ లేదు. దాదాపు అదే జట్టును కొనసాగించింది. జయదేవ్ ఉనద్కత్ కు చోటు దక్కింది. భారత జట్టు ఆసీస్ పై తొలి రెండు టెస్టులనూ గెలిచి సిరీస్ ను నిలుపుకుంది. మార్చి 17న మొదలయ్యే వన్డే సిరీస్ లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. అయితే తొలి వన్డేకు రోహిత్ అందుబాటులో ఉండడు. దీంతో ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Read Also: IND vs AUS: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం.. సత్తా చాటిన స్పిన్నర్లు

వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

Exit mobile version