NTV Telugu Site icon

Asia Cup 2023: ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. శ్రేయస్‌, రాహుల్‌ వచ్చేశారు! తెలుగోడికి ఛాన్స్‌

India T20 Team

India T20 Team

స్వదేశంలో జరుగనున్న ఆసియా కప్‌ 2023 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు ప్రకటించింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న స్టార్ ప్లేయర్స్ శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. అలానే తెలుగు ప్లేయర్ తిలక్‌ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.

ఆసియా కప్‌ 2023 జట్టులో ప్రసిద్‌ కృష్ణకు అనూహ్యంగా చోటు లభించింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ చోటు దక్కించుకోగా.. మరో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు నిరాశే ఎదురైంది. ఇక ట్రావెలింగ్ స్టాండ్-బై ఆటగాడిగా సంజు శాంసన్ ఎంపికయ్యాడు. ఇక ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్‌ పాండ్యా వైస్ కెప్టెన్. తిలక్‌ వర్మకు ఆసియా కప్‌ 2023లో చోటు దక్కడంతో తెలుగు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం ఢిల్లీలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఆసియా కప్‌ 2023 కోసం జట్టును ఖారారు చేశారు. ఈ సమావేశంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాల్గొన్నారు. ఆసియా కప్‌ 2023కి శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికలు కాగా.. హైబ్రిడ్‌ మోడల్‌లలో టోర్నీ జరగనుంది. ఆగస్టు 30న పాకిస్తాన్‌, నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్‌ 2న భారత్‌ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది.

భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.