NTV Telugu Site icon

BC Reservations : బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో మహాధర్నా… ఢిల్లీకి మంత్రులు పొన్నం, కొండా సురేఖ

Ponnam Prabhakar, Konda Sur

Ponnam Prabhakar, Konda Sur

BC Reservations : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్యలు పాల్గొని సంఘీభావం తెలియజేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా ఇందులో పాల్గొననున్నారు.

తెలంగాణ శాసనసభలో ఇటీవల బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఏప్రిల్ 2,3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ చేసిన కుల సర్వే వివరాలను వివరిస్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. ఏప్రిల్ 2,3 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ బృందం ప్రకటించింది. బీసీ సంక్షేమ సంఘాలతో కలిసి మహాధర్నా చేపట్టి, పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేసింది.

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..