మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం రాత్రి డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ మహిళలలు బారి బతుకమ్మను మధ్యలో పెట్టి కోలాటాలు ఉయ్యాల పాటలు డీజే పాటల నడుమ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.మేయర్ మేకల కావ్య తో కలిసి మహిళలతో బతుకమ్మ ఆడి పాడి మహిళలను ఉత్సహ పరిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ .. మన పండగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కార్పొరేషన్ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా కార్పొరేషన్ ప్రజలకు , ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంగిలి పూలను వెదజల్లుకొనే అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు అడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పూలు, తీరొక్క రంగులతో ఆడుకునే గొప్ప పండగ బతుకమ్మ అని అన్నారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి గౌరమ్మను తీర్చి కోరిన కోరికలు ఫలించాలనే నమ్మకంతో ఈ బతుకమ్మ పండుగ జరుపుతారని, దేశంలో పూలను పూజించి ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఇలాంటి సంస్కృతి మన తెలంగాణలోనే ఉందని, బతుకమ్మ పండుగను అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో, రాష్ట్ర పండుగగా గుర్తించారని ప్రతి ఏటా బతుకమ్మ కానుకగా మహిళలకు చీరలు తెరాస ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కొ-అఫ్సన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు,పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.