Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఫేమస్ హీరో రోడ్లపై అల్లరి..
- మ్యాచ్ సమయంలో కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basil Joseph: టీ20 వరల్డ్‌కప్ 2026 ను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇకపోతే ఈ సారి టోర్నీలో అసలు బ్యాటింగ్ వస్తుందో లేదో, ప్లేయింగ్ XI లో చోటు దొరుకుతుందో లేదో వంటి ప్రశ్నలు ఎదురైతున్న వేళ తన ఎంతటి విలువైన ఆటగాడినో నిరూపించాడు సంజు శాంసన్. అవును టోర్నీలో అతడు చేసిన చివరి మూడు హాఫ్ సెంచరీలతో విమర్శకులు తనపై మరోసారి నోరు తెరవకుండా ఉండేలా సమాధానం ఇచ్చాడు.
రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!
Also Read
ఇకపోతే.. సంజు శాంసన్ కేరళ రాష్ట్రంకు సంబంధించిన వ్యక్తి. అతడికి వారి రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వలిసిందే. కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, సినిమా స్టార్స్, రాజకీయ నాయకులు కూడా అతడి అభిమానులంటే నమ్మండి. ముఖ్యంగా అతడి ఫాలోయింగ్ ముందర హీరో, హీరోయిన్స్ ఫాలోయింగ్ కూడా వేస్ట్. ఇక అసలు విషయానికి వస్తే.. ఫైనల్ లో సంజు అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో స్టేడియం బయట మరో మలయాళీ స్టార్ హీరో రచ్చ రచ్చ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
.“#BasilJoseph didn’t behave like a celebrity star when #SanjuSamson was playing. He was just casually enjoying it like a fanboy. When Sanju plays for #CSK, can we expect the same kind of reaction? What do you say, @basiljoseph25 ?” 😄🏏 pic.twitter.com/9a3xnyMdQs
— Sugan Krish (@Im_Sugan07) March 9, 2026
మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్ (Basil Joseph ) అహ్మదాబాద్ రోడ్లపై సంజు జెర్సీని కొనుగోలు చేసి రోడ్డుపై అరుస్తూ అల్లరి చేస్తూ కనపడ్డాడు. అంతేకాదు భయ్యో.. స్టాండ్స్‌లో కూడా సంజు శాంసన్ కు మద్దతుగా ఉత్సాహంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. తన స్నేహితుడు సంజు కోసం అభిమానిలా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఉన్న అభిమానులు కూడా జోసెఫ్ ను చూసి ఉత్సాహంగా స్పందించారు. వారిలో ఒకరు సరదాగా “సంజు సామ్‌సన్ కేరళ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్” అని అభివర్ణించాడు.
నిజానికి బాసిల్ జోసఫ్, సంజు శాంసన్ మధ్య మంచి స్నేహం ఎప్పటినుంచో ఉంది. సంజు శాంసన్ ఎప్పుడు బాగా ఆడినా బాసిల్ సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా స్పందిస్తుంటాడు. వెస్టిండీస్ పై సంజు 97 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడినప్పుడు కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ అనంతరం మాట్లాడుతూ.. బాసిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ప్రతి భారతీయుడిలాగే నేనూ చాలా సంతోషంగా ఉన్నాను. సంజు అవకాశం తిరిగి వచ్చినప్పుడు అతను దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు” అని అన్నాడు. అలాగే “సంజు కేవలం పరుగులు మాత్రమే చేయలేదు. అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఓపెనర్‌గా నిలబడి చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయానికి నడిపిడించాడని.. 97 నాటౌట్‌తో జట్టును గెలిపించడం సినిమాల్లో క్లైమాక్స్ సీన్‌లా అనిపించింది” అని పోల్చాడు.
Basil Joseph is a vibe 😂🔥 pic.twitter.com/3zbackIjGi
— Ayyappan (@Ayyappan_1504) March 9, 2026
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!