బర్రెలక్క.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈవిడ సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తాను డిగ్రీ పూర్తి చేశానని ఆయన కానీ ఉద్యోగం రాలేదని దాంతో బర్రెలు కాస్తున్నట్లు చెప్పడంతో బాగా వైరల్ గా మారింది. నిజానికి బిఆర్ఎస్ పార్టీ అధికార సమయంలో ఆ వీడియో పెద్ద సంచలనగానే మారింది. అదే అదునుగా తనకు వచ్చిన పాపులారిటీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వాడుకుంది. ఆవిడ ఎన్నికల్లో నేపథ్యంలో చేసిన హంగామా అంతా ఇంత కాదు. కాకపోతే ఆ ఎన్నికల్లో ఆవిడ అంతగా ప్రభావం చూపలేకపోయింది.
Also Read: INDIA alliance: చీలిపోతున్న భారత కూటమికి కేజ్రీవాల్ అరెస్ట్తో బూస్టింగ్..
ఎంతోమంది రాజకీయ నాయకులు, కొందరు పెద్ద సార్లు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఆమె అంతగా ఓట్లు రాబట్టలేకపోయింది. ఇంకా మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది బర్రెలక్క. ఇక తాజాగా ఈమెకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. బర్రెలక్క అతి త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుంది. అవును నిజమే ఈ విషయం ఆమె చెప్పడం గమనార్హం. తాజాగా ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Somireddy vs Kakani: సోమిరెడ్డికి టీడీపీ టికెట్.. మంత్రి కాకాణి సంతోషం..!
బర్రెలక్క అసలు పేరు శిరీష.. సోషల్ మీడియాలో తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్న అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో శిరీష పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటిపై శిరీష కాస్త ఘాటుగానే స్పందించింది. కాకపోతే ఇప్పుడు మాత్రం తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.