NTV Telugu Site icon

IND vs BAN: నేడే రెండో టి20.. టీమిండియా జోరును బంగ్లాదేశ్ తట్టుకుంటుందా?

Ind Vs Ban

Ind Vs Ban

IND vs BAN: ఈరోజు (9 అక్టోబర్ 2024) మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్ నేటి మ్యాచ్ లోకి రంగంలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్ పరిస్థితి, ఈ మైదానంలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

IND W vs SL W: రెండో విజయంతో టీమిండియా సెమీ-ఫైనల్‌ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందా?

మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండవ T20 మ్యాచ్‌లో ఈ రోజు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ టీ20 సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండగా.., టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు తిరుగులేని ఆధిక్యంతో రెండో టీ20లోకి అడుగుపెట్టనుంది. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా , బంగ్లాదేశ్ టీ20 జట్టుకు నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహిస్తాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

AHA : కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’ “గొర్రె పురాణం”కి రికార్డు వ్యూస్

ఈరోజు టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి గత మ్యాచ్‌లో అదే టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. నేటి మ్యాచ్ ఢిల్లీలో ఉంది, కాబట్టి అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై ఉందిచెప్పవచ్చు. దీనికి కారణం అతని హోమ్ గ్రౌండ్ ఇదే. గత టీ20 మ్యాచ్‌లో తన ఫాస్ట్ బంతులతో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా మెరిసిన అతడు ఈరోజు హోమ్ గ్రౌండ్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. టీ20 చరిత్రలో బంగ్లాదేశ్‌తో ఆడిన 15 మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు 14 గెలిచింది. అయితే బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఢిల్లీ పిచ్ ఎల్లప్పుడూ బ్యాట్స్‌మెన్‌లకు సహాయకరంగా ఉంటుందని తెలిసిందే.

Show comments