Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్
- సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్
- మీడియాతో ముచ్చటించిన బండ్ల గణేశ్
- త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పిన బండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ ఆడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ అభిమాని మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్నారా? లేదా? అని అడిగితే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఈవెంట్‌కు రానివ్వడం లేదని బండ్ల గణేష్ అన్నారు. ఆ వ్యాఖ్యలు చేసింది తాను కాదన్న బండ్ల.. ఆపై ఒప్పేసుకుని క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో డైరెక్టర్ హరీశ్ శంకర్, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మీడియాతో నేడు ముచ్చటించారు. ఓ ఫిల్మ్ రిపోర్టర్ తీన్ మార్ చిత్రం గురించి అడగగా.. గబ్బర్ సింగ్ సినిమా అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పారు.
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
Also Read: Indian Pitches: ఆ ఆలోచన సరికాదు.. భారత పిచ్‌లపై హర్భజన్ సింగ్ అసహనం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకు వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న పవన్.. గబ్బర్ సింగ్‌తో రేసులోకి వచ్చారు. తాజాగా గబ్బర్ సింగ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ-రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!