NTV Telugu Site icon

Bandi Sanjay: కరీంనగర్ నుండే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం..

Bandi Sanjay

Bandi Sanjay

పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పనులను పరిశీలించారు. కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులతోపాటు జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతోనూ చర్చించారు.

Nitrogen Death: అమెరికాలో సరికొత్త మరణశిక్ష.. నైట్రోజన్‌తో 7 నిమిషాల్లోనే..!

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి తెలంగాణకు వస్తున్నారు. మూడు క్లస్టర్ మీటింగుల్లో పాల్గొంటారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ మీటింగ్ లో పాల్గొంటారు. వీటితోపాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారని పేర్కొన్నారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. 10 వేల నుండి 20 వేల మంది కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని.. పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తారని అన్నారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.. కాబట్టి ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

Padma Vibhushan: పద్మ పురస్కారాల వలన లాభం ఏంటి..? భారీగా న‌గ‌దు ముడుతుందా?

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నామని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చింది? ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందనే అంశంపై పూర్తి వివరాలను గ్రామాల వారీగా వివరిస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పాదయాత్ర చేస్తా.. సమయాభావాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లేటప్పుడు మాత్రం వెహికల్ లో వెళతానన్నారు. దాదాపు 20 రోజులపాటు యాత్ కొనసాగిస్తానని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తా.. కేంద్రం చేసిన కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తానని బండి సంజయ్ అన్నారు.