Padma Vibhushan: ఈ ఏడాది పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి సహా మరో నలుగురికి ఈసారి పద్మ పురస్కారాల్లో పద్మవిభూషణ్‌ని ప్రకటించారు. 15 మంది తెలుగువారికి పద్మ పురస్కారాలు దక్కాయి. దీంతో తెలుగువారు సంబురాల్లో మునిపోయారు. ఇక ఇలాంటి ప్రభుత్వ పురస్కారాలు వస్తే.. బెన్ ఫిట్స్ ఏముంటాయి అనేది చాలా తక్కువమందికి తెలుసు. అందుకే చిరుకు పద్మవిభూషణ్ రాగానే .. ఆయనకు తరువాత ఏమైనా స్పెషల్ పవర్స్ వస్తాయా.. ? భారీగా నగదు ముడుతుందా? .. అసలు పద్మ పురస్కారాల వలన లాభం ఏంటి అని చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ పద్మ పురస్కారం కేవలం గౌరవంకు సంబంధించినవే తప్ప.. వీటివలన ఎలాంటి డబ్బు కానీ, ఎలాంటి లాభాలు లేవు అని తెలుస్తోంది.
పద్మ పురస్కారం ఇచ్చిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ ఇవ్వబడదు.. ఎలాంటి డబ్బులు రావు. దీనివలన కలిగే ఏకైక లాభం.. ఈ పురస్కారం అందుకున్న వ్యక్తులు డైరెక్ట్ గా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. పద్మ అవార్డులో భాగంగా రాష్ట్రపతి సంతకం ఉన్న ధ్రువీకరణ పత్రం, పతకం మాత్రం బహుకరిస్తారు. పద్మ అవార్డు కేవలం గౌరవం మాత్రమే. రైలు, విమాన ప్రయాణంలో ఎలాంటి నగదు భత్యం లేదా రాయితీ పరంగా ఏదైనా సౌకర్యం,ప్రయోజనాలు ఈ అవార్డులకు జోడించబడవు. అవార్డు టైటిల్‌కు సంబంధించినది కాదు. లెటర్‌హెడ్‌లు, ఆహ్వాన కార్డులు, పోస్టర్‌లు, పుస్తకాలు మొదలైన వాటిలో అవార్డు గ్రహీత పేరుకు ముందు పెట్టుకోవడానికి కూడా వీలు ఉండదు. ఈ అవార్డును వారి వారి పరిశ్రమలో అసాధారణమైన పనితనాన్ని గుర్తించి ఇస్తారు. దీనివలన ప్రపంచం నలుమూలలా వారికి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి.