కేటీఆర్ సీఎం అయితే…. హరీష్ ఔట్ అని, బీఆర్ఎస్ నేతలారా.. బిస్తర్ సర్దుకోవాల్సిందేనన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఇవాళ ఆదిలాబాద్ లో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్… ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట.. ఇల్లులేని పేదలందరినీ తెలంగాణ నుండి తరిమేస్తాడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ … నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించు అని ఆయన సవాల్ విసిరారు. మున్నూరుకాపులను మోసం చేసిన వ్యక్తి జోగు రామన్న అని బండి సంజయ్ ఆరోపించారు. బీసీలంతా బీజేపీవైపు చూస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే రామరాజ్యం స్థాపిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాత్నాల ప్రాజెక్ట్‌పై చెక్ డ్యామ్‌లను నిర్మించడంలో కూడా విఫలమైందన్నారు.
Also Read : Koti Deepotsavam LIVE : మొట్టమొదటిసారిగా అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
పోరాడేవాళ్లకు ఓట్లేసి గెలిపించకపోతే… భవిష్యత్తులో ఏ పార్టీ కూడా పేదల పక్షాన కొట్లాడే అవకాశమే లేదన్నారు. కులాల పేరుతో రాజకీయం చేసి ఓట్లు దండుకుని ఆ కులాలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దేనన్నారు. తెలంగాణలోని బీసీలన్నీ బీజేపీకే ఓటేయబోతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం కాబోతున్నారు. ఈ విషయం ఓటు చేసే సమయంలో ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తాము 36 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌వాళ్లు 6 గ్యారంటీలు కాదు.. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారరు అనే గ్యారంటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బుల్డొజర్ ప్రభుత్వం రావాలా..? బాంచన్ దొర అనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వం రావాలో ఆలోచించాలన్నారు.
Also Read : Aadikeshava Trailer: నేను రాముడిని కాదు.. రుద్రకాళేశ్వరుడిని..