బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లు చర్చనీయాంశమయ్యాయి. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ అధిక సంఖ్యలో మీటింగ్ లు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లు 8 వేల చేరువలో ఉన్నాయి. గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలకు బండి సంజయ్ ఆదేశించారు. బీజేపీ నాయకులు ఉత్సాహంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొంటూ స్థానిక సమస్యలపై చర్చించడంతో పాటు కేసీఆర్ పాలనా వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో సఫలీక్రుతమయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల సంఖ్య 8 వేలకు చేరువలో ఉందని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన టార్గెట్ లో 80 శాతం మేరకు మీటింగ్ లు నిర్వహించామన్నారు.
Also Read : Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్
ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించామని, ఈ మీటింగ్ లో స్థానిక సమస్యల పైనే ఎక్కువ చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల పట్ల సంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ ల ద్వారా పార్టీ తొలిదశ క్షేత్రస్థాయి ప్రచారం పూర్తి చేసుకున్నట్లయిందన్నారు. ఈ మీటింగ్ లకు వస్తున్న స్పందనను చూసి బీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. అందుకే చాలాచోట్ల మీటింగ్ లను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటూ ఉనికి చాటుకునేందుకు ప్రయాస పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడాల్సిన పనిలేదని, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ భరోసా ఇవ్వాలని సూచించారు. మరో మూడు రోజులే (ఈనెల 28 వరకు) గడువు ఉన్నందున పార్టీ నిర్దేశించిన మేరకు 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు.
Also Read : Road Accident: కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
