Cricketer Heart Attack: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricketer Vasanth Rathod Dies Of Heart Attack While Playing Cricket In Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ.. ఓ క్రికెటర్ మైదానంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) ఫీల్డింగ్ చేస్తూ గ్రౌండ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అతని ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
ఈ ఘటనపై జీఎస్టీ విభాగం సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఆ మ్యాచ్‌లో వసంత్ మొదట్లో చాలా యాక్టివ్‌గానే కనిపించాడు. బౌలింగ్ వేసే సమయంలోనూ బాగానే ఉన్నాడు. అయితే.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, అతడు కింద పడిపోయాడు. ఏం జరిగిందోనని మేమంతా ఆందోళన చెందాం. మొదట్లో స్పృహ కోల్పోయి పడిపోయాడేమోనని భావించాం. ఎలాంటి కదలికలు లేకపోవడంతో సహచరులు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆలోపే అతడు మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు’’ అని చెప్పుకొచ్చారు. అతని మృతితో తమను కలచివేసిందని పేర్కొన్నారు. కాగా.. జీఎస్టీ విభాగంలో వసంత్ సీనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు.. గుజరాత్‌లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రాజ్కోట్‌లో ప్రశాంత్ భరోలియా(27), సూరత్‌లో జిగ్నేష్ చౌహాన్(31) అనే క్రికెటర్లు సైతం మైదానంలోనే గుండెపోటుతో మరణించారు.
Delhi Crime News: కుక్కపై అత్యాచారం.. కెమెరాకి చిక్కిన నిందితుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..